దసరా వేడుకలకు సిద్ధం సంగారెడ్డిలో


Mon,October 7, 2019 11:05 PM

-రావణ దహనానికి ఏర్పాట్లు
దసరా వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్‌లో దసరా సంబురాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు. రావణాసురుడిని దహనం చేసేందుకు పెద్ద శకటాన్ని తయారు చేశారు. అదే విధంగా ప్రజలకు సరిపోయే విధంగా ఏర్పాట్లు చేయడంతోపాటు మైదానం నిండుగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. పండగ సందర్భంగా పెద్ద ఎత్తున పటాకులు పేల్చి సంబురాలు జరుపుతారు. అదే విధంగా మైదానంలో రామయణ మహా కావ్యాన్ని పఠించి రావణాసుర వధ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేడుకలను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పర్యవేక్షణలో జరుగనున్నాయి. బాణాసంచా పేల్చేందుకు వేరుగా ప్రదేశాన్ని ఎంపిక చేసి అక్కడే పటాకులు కాలుస్తారు. అనంతరం పట్టణ ప్రజలు దసరా వేడుకలు జరుపుకుంటారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...