ఆర్టీసీ బస్సును ఢీకొన్నలారీ పలువురికి గాయాలు


Mon,October 7, 2019 11:04 PM

హత్నూర : ఆర్టీసీ బస్సును వెనుక వైపు నుంచి లారీ ఢీకొనడంతో పలువురికి గాయాలైన సంఘటన మండలం పల్పనూర్ బస్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో గజ్వేల్ నుంచి సంగారెడ్డి వెళుతుండగా, పల్పనూర్ బస్‌స్టేజీవద్ద ప్రయాణికులను ఎక్కించుకుంటుండగా, వెనుక నుంచి వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తునికి గ్రామానికి చెందిన కంసమ్మ కాలు విరుగడంతోపాటు మరో ప్రయాణికురాలు కళావతికి చేతికి గాయాలయ్యాయి. బస్సులో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న కండక్టర్ రాకేశ్‌తోపాటు మరో ముగ్గురికి స్వల్పగాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న హత్నూర పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...