పార్టీ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే


Mon,October 7, 2019 11:04 PM

వట్‌పల్లి: టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, రైతు విభా గం మండల మాజీ అధ్యక్షుడు ఆగపు వీరేశంను ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సోమవారం పరామర్శించారు. గత నెలలో తీవ్ర అస్వస్థకు గురైన వీరేశం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొంది సోమవారం ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమవారం పల్వట్ల గ్రామానికి వెళ్లి ఆయనను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. పార్టీ, ప్రభుత్వ పరంగా తగిన సహకారం ఉంటుందని పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట జాగృతి రాష్ట్ర కార్యదర్శి మఠం భిక్షపతి, పార్టీ మండల అధ్యక్షుడు వీరేశం, గౌతాపూర్ సర్పంచ్ ఖయ్యుం, నాయకులు ఇస్మాయిల్, సుభాశ్, మహేశ్ ఉన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన వివిధ మండలాల నాయకులు
గ్రామాల్లో నెలకొన్న, సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను సోమవారం వివిధ మండలాల నాయకులు ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. పోతులబొగుడలోని ఎమ్మెల్యే స్వగృహంలో వట్‌పల్లి, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పుల్కల్ మండలాలతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు ఎమ్మెల్యేను కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులపై నాయకులు దృష్టి సారించాలని తెలిపారు. సమస్యలన్నింటినీ గుర్తించి తగిన ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. అత్యవసరమైన వాటిని గుర్తించి వాటికి మొదటి ప్రాధాన్యతనిచ్చి పనులు చేపట్టాలన్నారు. మిగిలిన సమస్యలను వరుస క్రమంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అభివృద్ధి పనుల విషయంలో తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. 30రోజుల ప్రణాళికలో అన్ని మండలాల్లో పనులు బాగా జరిగాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...