పంచాయతీకి రూ.2లక్షల విరాళం


Mon,October 7, 2019 12:25 AM

హత్నూర: మండలంలోని దౌల్తాబాద్ గ్రామ పంచాయతీకి రూ.2లక్షల విరాళం దాత అందజేసినట్లు సర్పంచ్ కొన్యాల వెంకటేశం తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీరవీందర్ రూ.2లక్షల చెక్కును విరాళంగా అందజేశారని చెప్పారు. దీంతో గ్రామ పంచాయతీలో చెత్తను తరలించడానికి ఆటోను కొనుగోలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రియాజ్, వార్డుసభ్యులు కొన్యాల సతీశ్, వెంకటేశ్‌గౌడ్, నాయకులు హకీం, నర్సింహులు ఉన్నారు.

విరాళం ఇచ్చిన దాతలకు సన్మానం
రాయికోడ్: తాము పుట్టి పెరిగిన గ్రామాభివృద్ధికి తమవంతు సహాయం చేయాలనే దృక్పథంతో డబ్బులు రూ.55వేలను ఆదివారం సర్పంచ్ కేదార్‌నాథ్‌పాటిల్, పంచాయతీ కార్యదర్శి సంగమేశ్వర్‌కు అందజేశారు. ఆదివారం మండల కేంద్రం రాయికోడ్ చెందిన సావలి విఠల్ రూ.10వేలు, మల్లికార్జున్ రూ.30వేలు, రవి రూ.10 వేలు, డా.సిద్ధప్ప రూ.5 వేలను సర్పంచ్, కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ పాలక వర్గం వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...