గుర్తు తెలియని వాహనం ఢీకొని కార్మికుడు మృతి


Mon,October 7, 2019 12:25 AM

హత్నూర: గుర్తు తెలియని వాహనం ఢీకొని కార్మికుడు మృతి చెందిన ఘటన హత్నూర మండలం గుండ్లమాచునూర్ శివారులో ఆదివారం చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంది మండలం ఆరుట్లకు చెందిన తలారి యాదగిరి(45) కొంత కాలంగా భార్యాపిల్లలతో ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో నివాసం ఉంటున్నాడు. కాగా యాదగిరి గుండ్లమాచునూర్‌లోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి గుండ్లమాచునూర్‌లో రోడ్డుపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సంగారెడ్డి దవాఖానకు తరలించినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడికి భార్య లావణ్య, కుమారుడు ఉన్నాడు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...