దేవీ అమ్మవారి మండపాల వద్ద అన్నదానం


Mon,October 7, 2019 12:25 AM

అందోల్, నమస్తే తెలంగాణ/పుల్కల్: దేవీ నవరాత్స్రోవాల్లో భాగంగా జోగిపేటలోని పబ్బతి హనుమాన్ దేవాలయం ఎదుట సిరి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవీ మండపం వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ. నాగభూషణం, మాజీ సర్పంచ్ ఎస్.కృష్ణారెడ్డి, మాజీ వార్డు సభ్యుడు పట్లోళ్ల ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ డీజీ. వెంకటేశం, మాజీ కౌన్సిలర్ పి.గోపాల్‌రావు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, నాయకులు ఎస్. శ్రీనివాస్‌గౌడ్, అనిల్‌రాజ్, సందీప్‌గౌడ్, గాజుల పవన్, అనిల్, సిరియూత్ సభ్యులు శ్రీధర్, జగదీశ్, రాజాగౌడ్, ముద్దుకృష్ణ పాల్గొన్నారు. కాగా పుల్కల్ మండలంలోని సింగూర్, పుల్కల్ ఆదివారం యువజన సంఘాల అధ్వర్యంలో అమ్మవారి మండపాల వద్డ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...