గ్రామాల్లో బతుకమ్మ చీరెల పంపిణీ


Mon,October 7, 2019 12:24 AM

హత్నూర: ఆడపడుచులు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం మహిళలకు చీరెలను పంపిణీ చేస్తుందని సర్పంచ్ అంబటి సుధాకర్ తెలిపారు. ఆదివారం మండలంలోని చింతల్‌చెరులో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సలీం, వీఆర్వో ప్రభాకర్, రేషన్‌డీలర్ మల్లారెడ్డి, గ్రామస్తులు వీరారెడ్డి, మాణయ్య తదితరులు పాల్గొన్నారు.

అందోల్ రూరల్‌లో..
అందోల్ రూరల్: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆదివారం మండలంలోని తాలెల్మలో ఆడబిడ్డలకు సర్పంచ్ లింగాగౌడ్, ఎంపీటీసీ సుజాతనాగభూషణం ఆధ్వర్యంలో చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశోక్, డీలరు పర్వయ్య, వార్డు సభ్యులు బస్వరాజ్, పడుమటి రాజాగౌడ్, యాదయ్య, శ్రీనివాస్, రాములు, మల్లేశం బక్కమ్మ, లచ్చమ్మ, నర్సమ్మ పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...