బిజిలీపూర్ రేషన్ దుకాణంలో చోరీ


Mon,October 7, 2019 12:24 AM

వట్‌పల్లి: రేషన్ దుకాణంలో చోరీకి పాల్పడి రేషన్ సరుకులు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలోని బిజిలీపూర్‌లో ఆదివారం చోటు చేసుకున్నది. రేషన్‌డీలర్ మొగులయ్య తెలిపిన వివరాల ప్రకారం..శనివారం రాత్రివరకు లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేసి గదికి తాళం వేసి ఇంటికీ వెళ్లి ఆదివారం ఉదయం మళ్లీ తాళాలు తీసేందుకు రాగా గది తాళాలు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. గదిలోని సరుకులను పరిశీలించగా 10బియ్య బస్తాలు (5క్వింటాళ్లు) చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వండంతో వారు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...