ఫిబ్రవరి 13న కన్యకాపరమేశ్వరీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన


Mon,October 7, 2019 12:24 AM

-ముహూర్తం ఖరారు చేసిన మదనానంద సరస్వతీ స్వామి
సంగారెడ్డి మున్సిపాలిటీ: వాసవీ కన్యకాపరమేశ్వరీ మాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన చేయనున్నట్లు తోగుట మదనానంద సరస్వతీ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 8గంటలకు స్థానిక భవానీ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవానంద సరస్వతీ స్వామి మాట్లాడుతూ పట్టణ శివారులోని వాసవీ మాత ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో మాధవానంద సరస్వతీ స్వామి వారిచే వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మూడు రోజుల పాటు పూజలు చేయాలని సంకల్పం చేయడం జరిగిందని పేర్కొన్నారు. అమ్మవారి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని, ఇలాంటి అదృష్టం ఎన్ని జన్మలు ఎత్తినా రాదన్నారు. ఆర్యవైశ్యులు అందరూ 2020 ఫిబ్రవరి 11, 12, 13 తేదీల్లో ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా అమ్మవారి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశిస్తులు పొందాలని కోరారు. కార్యక్రమంలో వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయ అధ్యక్షుడు కటకం శ్రీనివాస్, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...