రాష్ర్టానికి ఆదర్శంగా నిలువనున్న చీక్‌మద్దూర్


Sat,October 5, 2019 11:16 PM

-ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి
హత్నూర: 30రోజుల పల్లె ప్రగతిలోచీక్‌మద్దూర్‌లో చేపట్టిన సంపూర్ణ పారిశుధ్యం, ప్లాస్టిక్ రహిత గ్రామంగా గుర్తింపు పొందడంతో రాష్ర్టానికి ఆదర్శంగా నిలువనున్నదని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని చీక్‌మద్దూర్, మాధుర, మల్కాపూర్, బ్రాహ్మనగూడ, నాగుల్‌దేవులపల్లి, గోవిందరాజ్‌పల్లి తదితర గ్రామాల్లో చేపట్టిన 30రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళిక పనులను మాజీ మంత్రి సునీతాలకా్ష్మరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం చీక్‌మద్దూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు గ్రామం ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా సంపూర్ణ పారిశుధ్యం కనిపించడంతోపాటు పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ వస్తువులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఎల్లప్పుడు గ్రామస్తులు ఇదేవిధంగా గ్రామాన్ని పారిశుధ్యంగా ఉంచుకోవాలని తెలిపారు. కాగా సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సహకారంతో అభివృద్ధిని సాధించడంతోనే గ్రామ రూపురేఖలు మారినట్లు తెలిపారు. చీక్‌మద్దూర్‌లో చేపట్టిన అభివృద్ధిని పరిశీలించడానికి త్వరలోనే ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌తో పాటు మంత్రులు అధికారులను తీసుకురానున్నట్లు తెలిపారు.

గ్రామ శివారులో చెరువుకట్టపై పార్కు ఏర్పాటు చేసి మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతానని తెలిపారు. అంతేకాకుండా గ్రామశివారులోని మంజీరానదిపై చెక్‌డ్యాం నిర్మాణానికి త్వరలోనే చర్యలు తీసుకుంటానని తెలిపారు. గ్రామంలో చేపట్టిన పనులకు సంబంధించి చీక్‌మద్దూర్ యాప్ పేరుతో రూపొందిచిన యాప్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం పలు గ్రామాల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వావిలాల నర్సింహులు, జడ్పీటీసీలు పొట్లచెర్వు ఆంజనేయులు, శేషసాయిరెడ్డి, ఎంపీడీవో ప్రమీలానాయక్, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్, సునీతారాజు, మాధవినవీన్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రవీందర్‌నాయక్, సుధాకర్, ఎంపీటీసీ ప్రవీనతోపాటు టీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...