శ్రీవారిని దర్శించుకున్న పశు సంవర్ధకశాఖ డైరెక్టర్


Sat,October 5, 2019 11:16 PM

సంగారెడ్డి మున్సిపాలిటీ: శ్రీ వైకుంఠపురంలో పరిసరాలు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా, ఆలయ ప్రాంగణంలో గోశాలలో గోవుల రక్షణ సమవృద్ధిగా ఉన్నాయని పశు సంవర్ధశాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ వి. లకా్ష్మరెడ్డి అన్నారు. శనివారం పట్టణ శివారులోని మహాలక్ష్మి విరాట్ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం (శ్రీ వైకుంఠపురం)ను ఆయన సందర్శించారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఆవుల పెంపకం, వాటి ఆరోగ్య పరిస్థితి తదితర వివరాలను ఆలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారి శేష వస్ర్తాలతో లకా్ష్మరెడ్డిని సన్మానించారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...