ముగిసిన 30రోజుల ప్రణాళిక


Sat,October 5, 2019 11:15 PM

కంది : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30రోజుల ప్రణాళిక ముగిసింది. శనివారం మండల పరిధిలోని ఆయా గ్రామాలతోపాటు సంగారెడ్డి మండల పరిధి గ్రామాల్లో ముగింపు సమావేశాలను నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రత్యేకాధికారి సమక్షంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి 30రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులపై ఆరా తీశారు. వందశాతం పూర్తయిన పనులు, ఇంకా పూర్తి కావాల్సిన పనులపై సర్పంచ్‌ల ఆధ్వర్యంలో పంచాయతీ సభ్యులతో కలిసి తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు. కంది మండలం కవలంపేటలో ప్రత్యేకాధికారి డీఈవో విజయలక్ష్మి గ్రామసభలో పాల్గొని పనులపై సభ్యులతో సమీక్షించారు. అలాగే కలివెముల, చెర్లగూడెం, కవలంపేట, ఎద్దుమైలారం, చిమ్నాపూర్ గ్రామాల్లో అధికారులతో కలిసి గ్రామస్తులు మెగా శ్రమదానంలో పాల్గొన్నారు. సంగారెడ్డి మండలం ఫసల్‌వాది, కల్పగూర్, కులబ్‌గూర్, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, కొత్లాపూర్ గ్రామాల్లో ప్రత్యేకాధికారుల సమక్షంలో గ్రామసభలు, మెగా శ్రమదానం చేపట్టారు. ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 30రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...