ఇసుక ఫిల్టర్లపై పోలీస్, రెవెన్యూ సిబ్బంది దాడులు


Sat,October 5, 2019 11:15 PM

కంది : అక్రమంగా ఇసుకను ఫిల్టర్ చేస్తూ తరలిస్తున్న ఇసుక క్వారీలపై పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దాడులు చేశారు. శనివారం తహసీల్దార్ సరస్వతి, రూరల్ సీఐ శివకుమార్ ఆధ్వర్యంలో మండలంలోని బ్యాతోల్ గ్రామ శివారులో కొన్ని నెలలుగా అక్రమంగా ఇసుకను ఫిల్టర్ చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కలిసి దాడులు చేయగా మొత్తం మూడు జేసీబీలు, ఐదు ట్రాక్టర్లు, ఒక టిప్పర్‌ను సీజ్ చేశారు. దీంతోపాటు ఇసుకను తోడే రెండు ఇటాచీ వాహనాలను కూడా సీజ్ చేయనున్నారు. ఇటాచీ వాహనం తరలింపునకు కొంత ఇబ్బంది కారణంగా రెండ్రోజుల్లో ఆ వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఇసుక ఫిల్టర్ తతంగం వెనుక కొందరు బడా నాయకుల అండదండలు ఉన్న కారణంగా ఈ దందా జోరుగా నడుస్తుందని అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. దాడి చేసిన నాలుగు క్వారీలు కూడా ఒకే వ్యక్తికి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. ఇకపై ఎవరైనా అక్రమంగా మట్టి, ఇసుక ఫిల్టర్లను నడిపిస్తున్నట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...