ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా..


Sat,October 5, 2019 12:05 AM

-సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
-తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్ల నియామకం

సంగారెడ్డి టౌన్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తం గా సమ్మె నిర్వహించేందుకు పిలుపునివ్వడంతో ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులకు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దసరా నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు, ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడుస్తున్న 181 ప్రైవేట్ బస్సులను ఉమ్మడి జిల్లాలోని రహదారులపై తిప్పనున్నారు. అదే విధంగా మెదక్ రీజియన్ పరిధిలో ఉన్న 491 ఆర్టీసీ బస్సులను కూడా తిప్పేందుకు తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లను నియమించేందుకు ఆర్ ఎం రాజశేఖర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు..
ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనుండడంతో ప్రజల కు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నా ఏర్పా ట్లు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో అద్దె ప్రాతిపదికన నడుస్తున్న 181 ప్రైవేట్ బస్సులను జిల్లాలోని ప్రధాన రహదారులపై తిప్పనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. దసరా సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న విద్యాసంస్థల బస్సులను నడుపుతామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. వాటితో పాటుగా ట్యాక్సీ ప్లేట్ ఉన్న వాహనాలను సైతం ఆర్టీసీ ఉపయోగించుకుంటుందన్నారు. ట్యాక్సీ ప్లేట్ ఉన్న వాహనాలకు వారం రోజులకు జిల్లాలో తిరిగేందుకు కారు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లకు రూ.200లు తీసుకుని పర్మీషన్ ఇవ్వనున్నారు. ప్రజలందరూ తమ గమ్య స్థానాలకు వెల్లేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా అన్ని ఏర్పాటు చేశారు.

నేడు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని వివిధ సంఘాలు ఈనెల 5వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్చినందున ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా ఈనెల 5వ తేదీన ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపడుతున్నారు. డ్రైవర్ల ఎంపిక ఉదయం 8.00 గంటల నుంచి మధ్యా హ్నం 4.00 గంటల వరకు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్ ఆర్టీవో కార్యాలయాలలో ఇంటర్వూలు నిర్వహిస్తామన్నారు. 18 నెలల కాలపరిమితి పూర్తయిన హేవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మద్య వయస్కులు అర్హులన్నారు. జీతం రోజుకు రూ.1500లు చెల్లింస్తామన్నారు. అదే విధంగా కండక్టర్ల ఎంపిక ప్రక్రియ ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు సంబంధిత డిపో ఆవరణలో నిర్వహిస్తామన్నారు. 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులని, 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డును సంబంధిత డిపో మేనేజర్ వ ద్ద సమ్మె కాలంలో భద్ర పర్చడం జరుగుతుందన్నారు. రోజుకు జీతం రూ.1000లు ఉంటుందన్నారు.

రిటైర్డు అయిన సూపర్ వైజర్లు, అధికారులు, మెకానిక్, క్లరికల్ స్టాఫ్ పనిచేయడానికి ఆసక్తి కలవారు రీజినల్ మేనేజర్ కార్యాలయంలో ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు సంప్రదించాలన్నారు. రిటైర్డు అధికారులు, సూపర్‌వైజర్లకు రోజుకు రూ.1500లు, రిటైర్డు మెకానిక్‌లు, క్లరికల్ ఉద్యోగులకు రూ.1000లు వేతనం ఇస్తామన్నారు. డిపోల వారీగా సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు సంగారెడ్డి డివిజనల్ మేనేజర్ 9959226264, సిద్దిపేట డివిజనల్ మేనేజర్ 9959226263, సంగారెడ్డి డిపో మేనేజర్ 9959226267, మెదక్ డిపో మేనేజర్ 9959226268, నారాయణఖేడ్ డిపో మేనేజర్ 9959223170, జహీరాబాద్ డిపో మేనేజర్ 9959226269, సిద్దిపేట/దుబ్బాక డిపో మేనేజర్ 9959226271, గజ్వేల్ డిపో మేనేజర్ 9959226270, హుస్నాబాద్ డిపో మేనేజర్ 9959225930 నంబర్లను సంప్రదించాలని కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో తాత్కాలికంగా పనిచేసేందుకు డ్రైవర్లు, కండక్టర్లకు ఇంటర్వూలు నిర్వహించారు. వారికి డ్రైవర్లకు రోజుకు రూ.1500, కండక్టర్లకు రూ.1000లు వేతనంగా ఇవ్వనున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...