విధులకు ఆటంకం కల్గించిన వ్యక్తికి జైలు శిక్ష


Sat,October 5, 2019 12:02 AM

మునిపల్లి: విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు ఆటంకం చేసిన వ్యక్తికి 4రోజుల జైలు శిక్ష, ఐదు వందల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం మండల పరిధిలోని బుధేరా పోలీస్ స్టేషన్‌ల్లో విలేకర్లతో మాట్లాడుతూ గణేశ్ నిమర్జనం విధుల్లో భాగంగా కానిస్టేబుళ్లు సంగయ్య, మల్లేశం మండలంలోని లోనికుర్దు గ్రామానికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన గొల్ల మల్లేశం కానిస్టేబుళ్ల విధులకు ఆటంకం కలిగించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శుక్రవారం సంగారెడ్డి కోర్టు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రభాకర్ ఎదుట హాజరు పర్చగా ఆయన మల్లేశనికి 4రోజుల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...