హైదరాబాద్‌లో తప్పిపోయి..ఖాదీరాబాద్‌లో దొరికింది


Sat,October 5, 2019 12:02 AM

వట్‌పల్లి: మతి స్థిమితంలేని ఓ మహిళా హైదరాబాద్‌లో తప్పిపోయి...ఖాదీరాబాద్‌లో దొరికింది. మతి స్థిమితం లేని 50 సంవత్సరాల మహిళా గురువారం రాత్రి ఖాదీరాబాద్‌లో గ్రామస్తుల కంటపడింది. కొంత సేపు గ్రామస్తులు ఎవరి బంధువులేమో అనుకుని ఎవరిదారిన వెళ్లారు. కానీ ఆమె ఎక్కడికి వెళ్లకపోవడంతో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా సరైన వివరాలు చెప్పకపోవడంతో మతిస్థిమితం సరిగ్గా లేదని నిర్ధారించుకున్నారు. సర్పంచ్ స్వర్ణలతారెడ్డి, ఎంపీటీసీ సుజాత ఆమెతో మాట్లాడగా పేరు రాణి అని చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు వట్‌పల్లికి చేరుకుని తప్పిపోయి వచ్చిన మహిళను వారి వెంట తీసుకు వెళ్లారు. ఆమె పేరు రాణి అని వారి కుటుంబ సభ్యులు అమెరికాలో ఉంటారని కరీంనగర్‌లో ఉన్న బంధువుల వద్దకు వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి తప్పిపోయినట్లు వారు తెలిపారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...