టీబీ నివారణ, సీల్ సెల్స్ క్యాంపెయిన్‌లో


Sat,October 5, 2019 12:02 AM

-సంగారెడ్డి జిల్లా రెండో స్థానం
సంగారెడ్డి మున్సిపాలిటీ : టీబీ సీల్ సేల్స్ 69వ క్యాంపెయిన్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. ఇందుకు గాను శుక్రవారం రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలలో జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీబీ నివారణ, టీబీ సీల్ సేల్స్ క్యాంపెయిన్‌లో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా రెండో స్థానం దక్కించుకోవడం గర్వకారణమన్నారు. అక్టోబర్ 4వ తేదీన క్షయవ్యాధి నివారణకు సంబంధించి ఐదు రసాయనాల స్టిక్కర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అందజేస్తుందన్నారు.

వాటిని అవుట్ పేషంట్లకు విక్రయిస్తుందని తర్వాత వచ్చే డబ్బులతో 50 శాతం క్షయవ్యాధిగ్రస్తుల సంక్షేమాన్ని, మిగతా 50 శాతం టీబీ అసోసియేషన్ ద్వారా డబ్బులను ఖర్చు చేస్తుందన్నారు. కాగా గత సంవత్సరం టీబీ స్టిక్కర్లు విక్రయించడంలో జిల్లా రూ.3 లక్షల ఆదాయం సమకూర్చి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఈ మేరకు శుక్రవారం 70వ టీబీ స్టిక్కర్ల విడుదల సందర్భంగా గవర్నర్ గత సంవత్సరం ప్రథమ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా, ద్వితీయ స్థానంలో నిలిచిన సంగారెడ్డి జిల్లా అవార్డును ప్రదానం చేసిందన్నారు. కార్యక్రమంలో టీబీ అసోసియేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ టీవీ వెంకటేశ్వర్లు, డీపీహెచ్‌డబ్ల్యు డాక్టర్ శ్రీనివాసరావు, టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎ.రాజేశం, తెలంగాణ టీబీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సుధీర్ ప్రసాద్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రాజేశ్వరి, డిస్ట్రిక్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డిలు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...