చాముండేశ్వరీ దేవికి ఘనంగా పూజలు


Sat,October 5, 2019 12:01 AM

జిల్లాలో దేవీ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని అమ్మవార్లకు నిత్య పూజలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రామచంద్రాపురంలోని భెల్ కనకదుర్గ ఆలయంలో శుక్రవారం అమ్మవారిని మహాలక్ష్మిదేవిగా అలంకరించి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అదేవిధంగా ఆలయం సన్నిధిలో మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించారు.గుమ్మడిదల మండలం బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆరో రోజు భద్రకాళీమాత కామేశ్వరీదేవిగా పూజలందుకున్నారు. ఝరాసంగంలో బాణ లింగా రూపుడైన పార్వతీ సమేత సంగమేశ్వర ఆలయంలో అమ్మవారు చాముండేశ్వరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. రాయికోడ్‌లో కొలువై ఉన్న ముమ్మాదేవి మాత దేవీ నవరాత్రులలో భాగంగా లక్ష్మీదేవి సుందరీగా దర్శనమిచ్చింది. - రామచంద్రాపురం/గుమ్మడిదల/ఝరాసంగం/రాయికోడ్

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...