రుణమేళాకు అనూహ్య స్పందన


Sat,October 5, 2019 12:01 AM

సంగారెడ్డి చౌరస్తా : ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పీఎస్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన రుణమేళాకు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 1300మంది ఖాతాదారులు ఈ మేళాను సందర్శించారు. 637మంది ఆయా బ్యాంకుల్లో ఖాతాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు రూ.40కోట్లకు సంబంధించిన రుణ దరఖాస్తులు అందగా వాటిలో రూ.26కోట్లను 378మందికి రుణాలు మంజూరు చేశారు. ఖాతాదారుల విస్తరణలో భాగంగా సేవింగ్స్, కరెంట్ ఖాతాలు, డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలు, ముద్ర, వ్యాపార, గృహ, వాహన, వ్యవసాయ, వ్యక్తిగత, ట్రాక్టర్, పనిముట్ల రుణాలు తదితర వివరాల కోసం రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రుణమేళాకు ఖాతాదారులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని లీడ్ బ్యాంకు మేనేజర్ మోహన్‌రెడ్డి తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...