నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలి


Thu,October 3, 2019 11:57 PM

టేక్మాల్ : హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని సర్పంచ్ సుప్రజ పేర్కొన్నారు. మండల కేంద్రంలో నాటిన మొక్కలకు గురువారం ట్రీగార్డ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం హరితహారానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమని, మొక్కలను నాటి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్, సుధాకర్, స్థానికులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...