గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం


Thu,October 3, 2019 11:56 PM

-డీపీవో వెంకటేశ్వర్లు
రాయికోడ్: గ్రామాల్లో అపరిశుభ్రతను తొలిగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పిండమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండల పరిధిలోని సంగాపూర్ గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 30రోజుల కార్యాచరణలో హరితహారం, పచ్చదనం-పరిశుభ్రత, విద్యుత్‌వారం, స్మృతివనాల ఏర్పాటు, తదితర ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని అమలు చేయాలన్నారు. గ్రామంలో పిచ్చిమొక్కల తొలిగింపు, పాడుబడ్డ బావుల పూడ్చివేత, పాడుబడ్డ ఇండ్లను కూల్చివేత తదితర కార్యక్రమాలను పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా సంగాపూర్‌ను జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, గ్రామస్తులకు సూచించారు. అందుకు గ్రామస్తులు సహకరించాలన్నారు. గ్రామంలో ప్లాస్టిక్ వస్తువులను సేకరిస్తున్న శామ్‌సన్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీకాంత్‌గౌడ్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మండల ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుప్రియ, ఉప సర్పంచ్ నగేశ్ పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...