నేడు మంత్రి హరీశ్‌రావు పర్యటన


Thu,October 3, 2019 11:56 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ/కోహీర్ : ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం మండలంలో పర్యటించనున్నారు. వెంకటాపూర్ గ్రామంలో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. సంబంధిత అధికారులు గురువారం ఏర్పాట్లు చేశారు. ఉదయం 10గంటలకు విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభిస్తారు. 10.30 గంటలకు జహీరాబాద్ మున్సిపల్‌లోని రంజోల్‌లో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో వసతి గృహాన్ని ప్రారంభిస్తారు. 10:45 గంటలకు పస్తాపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ ప్రాంతం వద్ద హరిత హారంలో పాల్గొని మొక్కలు నాటుతారు. జహీరాబాద్ పట్టణం ఆర్యనగర్‌లో ముగు కాలువ భూమి పూజ, 11.45 రైల్వే లైను పక్కన రోడ్డు పనులు చేసేందుకు శంకుస్థాపన చేసి, మ.12 గంటలకు జహీరాబాద్ పట్టణంలో లింగాయత్ సమాజ్ భవనం ప్రారంభించి, మ.12.15 గంటలకు జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం జహీరాబాద్ పర్యటనను ముగించుకొని సాయంత్రం 4గంటలకు కోహీర్ పట్టణంలోని ఓంకారేశ్వరాలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఓంకారేశ్వరాలయ పీఠాధిపతి సద్గురు డా.ప్రతాప దక్షిణామూర్తి దీక్షితుల ఆశీస్సులను పొందనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారని టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. మండల పర్యటనను విజయవంతం చేయాలని వారు కోరారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...