సకాలంలో అభ్యర్థులు హాజరు కావాలి


Thu,October 3, 2019 11:56 PM

-ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
సంగారెడ్డి టౌన్ : ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన 708 మంది అభ్యర్థులు జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరు కావాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు తమ సొంత చేతిరాతతో అటెస్టేషన్ ఫాం నింపేందుకు జిల్లా పోలీస్ కార్యాలయానికి సకాలంలో చేరుకోవాలన్నారు. ఈ ఫారంలో అభ్యర్థి పేరు, వయస్సు, పుట్టిన ప్రాంతం, చిరునామా, ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ నివసిస్తున్నారనే విషయాలను నమోదు చేయాలన్నారు. ఈ నెల 9వ తేదీన పోలీస్ కార్యాలయానికి వచ్చే 328 సివిల్, 149 ఏఆర్, 177 టీఎస్‌ఎస్‌పీ, 34 ఫైర్, ఎస్‌పీఎల్ 2, ఐటీ అండ్‌సీ 6, వార్డర్స్ 6, డ్రైవర్స్ 3, మెకానిక్ 3 పోస్టులకు ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లు 2 పాస్‌పోర్ట్ ఫోటోలు, అన్ని ఓరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో ఉదయం 11 గంటల వరకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి రావాలని సూచించారు. మండలం నల్లవా

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...