కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ


Thu,October 3, 2019 11:56 PM

సంగారెడ్డి టౌన్ : బతుకమ్మ సంబురాలను కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు బతుకమ్మలు పేర్చి బతుకమ్మ ఆడుతూ ఆట పాటలతో అలరించారు. బతుకమ్మ వేడుకలలో కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఆడపడుచులకు ఎంతో ప్రీతిపాత్ర అయిన పండుగ బతుకమ్మ అని అన్నారు. అనంతరం డీఆర్‌వో రాధికారమణి మాట్లాడుతూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ అన్నారు. ఈ నెల 5వ తేదీన కలెక్టరేట్ ఆవరణలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ జీవితాలలో ముడిపడి ఉన్న బతుకమ్మ, దసరాలను కులమతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉన్నదన్నారు. 5వ తేదీన జరిగే బతుకమ్మ సంబురాలకు పట్టణ మహిళ ప్రముఖులు, అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...