ఘనంగా టీటీఎఫ్ ఆవిర్భావ వేడుకలు


Wed,October 2, 2019 10:54 PM

సంగారెడ్డి టౌన్ : తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సీహెచ్.రాములు ఆ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి డి.జగన్నాథం, జిల్లా అధ్యక్షుడు భూమి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మయ్యయాదవ్, మార్పు కళా మండలి అధ్యక్షుడు ఎన్నార్, విశ్రాంత ప్రిన్సిపాల్ అనంతయ్య, టీటీఎఫ్ నాయకులు మేకల శ్రీనివాస్, ప్రశాంతి, ఆర్.కృష్ణయ్య, కె.జయలక్ష్మి, చంద్రమోహన్, శివశంకర్, భోజరాజు అశోక్, చంద్రశేఖర్, నర్సింహులు, రాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...