మారుతున్న పల్లె చిత్రం


Fri,September 20, 2019 11:20 PM

-30 రోజుల ప్రణాళిక అమలుకు అధికారుల కృషి
-మారుమూల ప్రాంతాల్లోనూ అధికారుల, ప్రజాప్రతినిధుల పర్యటన
-తొలిగిపోతున్న సమస్యలు
గ్రామాలాభివృద్ధియే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణలో భాగంగా అందోలు నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల పరిధిలోని గ్రామాల్లో పారిశుధ్య పనులు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గంలోని అందోలు, పుల్కల్, రాయికోడ్, వట్‌పల్లి, మునిపల్లి, నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలాల పరిధిలోని గ్రామాల్లో పారిశుధ్యం, విద్యుత్ సమస్యలు, శ్రమదానం, హరితహారం తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలు, యువజన సంఘాలు, డ్వాక్రా సంఘాల సహకారంతో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రత్యేకాధికారులు వివిధ పనులను చేపడుతున్నారు. గ్రామాల్లో పిచ్చి మొక్కలను తొలిగించడం, పాడుబడిన బావులను పూడ్చివేయడం, రోడ్లపై గుంతలను పూడ్చడం,శుభ్రం చేయడం, వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకొవడం, మురికి కాల్వవలను శుభ్రం చేయడం, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో మొక్కలు నాటడం వంటి పనులను చేపడుతున్నారు. పనుల్లో ప్రత్యేకాధికారులు, మండల, గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకుంటూ, పర్యవేక్షిస్తున్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...