బీరంగూడ రహదారి నాలుగు లేన్లుగా విస్తరణ


Thu,September 19, 2019 11:22 PM

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆనందం నింపారు. గురువారం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి జన్మదిన సందర్భంగా నగరంలో ఉన్న మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ఆహ్వానించి తన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణను మంత్రి సాదారంగా ఆహ్వానించి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పూల మొక్కను అందజేశారు. ఇదే సందర్భంలో మంత్రి కేటీఆర్ బీరంగూడ కమాన్ నుంచి కిష్టారెడ్డిపేట వరకు రోడ్డును విస్తరించే ఆర్డర్‌ను అందజేశారు. హెచ్‌ఎండీఏ నిధులు రూ. 49కోట్లతో ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తారు. నాలుగు లేన్ల రోడ్డుకు అనుమతి రావడంతో ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవను ప్రశంసించారు. అమీన్‌పూర్ మండలవాసుల చిరకాల డిమాండ్ నాలుగులేన్ల రోడ్డని అనుమతులు ఇవ్వడంతో ప్రజలు ఎంతో సంతోషిస్తారని తెలిపారు. మీ అశీస్సులతో పటాన్‌చెరు నియోజకవర్గంను అదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మంత్రికి హామీనిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ రూ. 49కోట్లను మంజూరు చేసిన మంత్రికి అభినందనలు తెలిపారు. బీరంగూడ కమాన్ నుంచి కిష్టారెడ్డిపేట వరకు నాలుగులేన్ల రోడ్డు అన్ని హంగులతో విస్తరించి నిర్మిస్తామని తెలిపారు. 67శాతం హెచ్‌ఎండీఏ నిధులు, 33శాతం స్థానిక మున్సిపాలిటీ నిధులను ఈ విస్తరణ పను ల్లో ఖర్చు చేస్తామని ఆయన వివరించారు. తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాద ని, చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నారు.

నాయకుల సంబురాలు
అమీన్‌పూర్: ఎన్నో యేండ్లుగా ఎదురుచూస్తున్న బీరంగూడ టూ కిష్టారెడ్డిపేట్ రహదారి సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనున్నండంతో స్థానిక నాయకులు, ప్రజలు సంబరాలు జరుపుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ దేవానంద్, జడ్పీపీటీసీ సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింహాగౌడ్ గురువారం విలేకర్లతో మాట్లాడుతూ ఇక్కడి ప్రజల కళ నేరవెర్చినందుకు తామతోపాటు ఇక్కడి ప్రజలు ఎంతో ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తులసిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మల్లేశ్, కవితా శ్రీనివాస్‌రెడ్డి, బాలరాజు, కాలప్ప, మాజీ సర్పంచ్, మంజుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...