రైతు సమస్యల పరిష్కారానికి కల్గుడి


Thu,September 19, 2019 11:22 PM

సంగారెడ్డి చౌరస్తా: రైతుల సమస్యల పరిష్కారం కోసం కల్గుడి యాప్ ఉపయోగపడుతుందని కలెక్టర్ ఎం. హనుమంతరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయ రైతు ఉత్పత్తిదారు సహకార సంఘం రాయికోడ్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వరము కల్గుడి యాప్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమస్యలకు మంచి ప్లాట్ ఫాం ఈ కల్గుడి యాప్ అని అన్నారు. రైతు ఉత్పత్తిదారు సహకార సంఘంలో ఉన్న రైతులు, వ్యాపారస్థులకు అనుసంధానంగా ఈ యాప్ ఉపయోగడుతుందన్నారు. రైతులందరూ సంఘాలుగా ఏర్పడి పంటల మీద అవగాహన పెంచుకోవాలన్నారు. ఏ కాలంలో ఏ పంట వేయాలి, వాతావరణం, పంటలకు వాడాల్సిన పురుగు మందులు ఎంత వాడాలి, రైతులకు కావాల్సిన అన్ని విషయాలను ఈ యాప్ వారికి తెలియజేస్తుందన్నారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో రైతులకు కావాల్సిన సమాచారం అందజేయడానికి ఈ యాప్ ఎంతో దోహదపడుతుందన్నారు. రైతులు సాంకేతిక విజ్ఞానం పెంపొందించుకోవాలని, నాణ్యత విషయంలో తక్కువ ఖర్చుతో పంటలు పండించి ఎక్కువ లాభాలు అందుకోవచ్చన్నారు.

దళారుల ప్రమేయం లేకుండా రైతులు పండించిన పంటలను నేరుగా వ్యాపారులకు అమ్ముకోవడానికి ఈ యాప్ మార్గం చూపుతుందన్నారు. రైతు ఉత్పత్తిదారు సహకార సంఘం లక్ష్యానికి ఆత్మతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. ఇది ప్రారంభం మాత్రమే అయినందున ఎక్కువ గంటలు పని చేసి రైతు సమస్యలకు సాంకేతిక విజ్ఞానంతో మెళకువలు నేర్పాలన్నారు. రైతులను చైతన్యం చేసి వ్యాపారులకు అనుసంధానంగా ఈ యాప్ ఉపయోగపడుతుందని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ యాప్ పూర్తిగా ఉచితమైనందున రైతులందరూ సాంకేతికంగా ముందుండాలని పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రంలోనే జిల్లాలోని రాయికోడ్‌లో ఈ యాప్‌ను ప్రారంభించడంపై కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆత్మ పీడీ నర్సింహారావు, వ్యవసాయశాఖ ఏడీఏ హరిత, కల్గుడి యాప్ ప్రతినిధులు రాజు వల్లభనేని, కట్టబెన్ని, ఓలెటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...