గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి


Thu,September 19, 2019 12:41 AM

కోహీర్ : గ్రామాలను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ప్రజలందరూ స్వ చ్ఛందంగా శ్రమదానం నిర్వహించాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి, మండల ప్రత్యేకాధికారి శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని పిచెర్యాగడి, మాచిరెడ్డిపల్లి, రాజనెల్లి గ్రామాలో చేపట్టిన 30రోజుల కార్యాచరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాలను సర్పంచులు మాత్రమే అభివృద్ధి చేయలేరని ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. గ్రామాలాభివృద్ధిలో యువత కూడా ముందుండాలన్నారు. పాడు బడిన ఇండ్లను కూ ల్చాలని ప్రమాదకర బావులను కూడా వెంటనే పూడ్చివేయాలని కోరారు. ఇంటి సమీపంలో ఉండే బావులను ఇంకుడు గుంతలుగా మార్చుకునే అవకాశం ఉంటుందన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు పిచ్చిమొక్కలను తొలిగించాలన్నారు. నిర్మించుకొన్న మరుగుదొడ్లను వందశాతం వినియోగించాలని అన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...