చురుగ్గా సాగుతున్నాయి..


Thu,September 19, 2019 12:40 AM

జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో పారిశుధ్య పనులు, హరితహారం వేగంగా పూర్తి చేసేందకు కృషి చేస్తున్నామని ఎంపీడీవో రాములు తెలిపారు. బుధవారం ఆయన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు గ్రామాల్లో చురుకుగా సాగుతున్నాయి. వ్యర్థాలను బహిరంగంగా అరుబయట వేస్తే ఆపరాద రుసుము విధించాలని గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు. హరితహారంలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గామం నుంచి ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమం జరుగుతుందని, సేకరించి ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...