రెండో పెళ్లికి యత్నిస్తున్న భర్తను శిక్షించాలి


Mon,September 16, 2019 11:58 PM

సంగారెడ్డి టౌన్ : ప్రేమించి పెండ్లి చేసుకున్నామని, తనకు ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం కట్నం కావాలని లేకుంటే రెండో పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని వట్‌పల్లి మండలానికి చెందిన ఒక ఫిర్యాదురాలు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు జిల్లాలోని పలు మండలాల నుంచి వినతులు వచ్చాయి. అవి ఇలా ఉన్నాయి..
-తాను ప్రేమించి పెద్దల సమక్షంలో 2006వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నామని, పెళ్లి అనంతరం తమకు ఇద్దరు పిల్లలు పుట్టారని, అప్పటి నుంచి తన భర్త పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కట్నం కోసం ఇబ్బందులకు గురి చేయగా తమ తల్లిదండ్రులు మూడున్నర తులాల బంగారం ఇచ్చారని, అది సరిపోదని ఇంకా డబ్బులు కావాలని తన భర్త మానసికంగా, శారీరకంగా వేధించడంతో పాటు తాను వేరొక పెళ్లి చేసుకుంటానని ఇబ్బందులకు గురిచేయడంతో గత సంవత్సరం పుట్టింటికి వచ్చానని, అప్పటి నుంచి తన భర్త తనను ఇంటికి తీసుకెళ్లడానికి రాలేదని, తనకు చట్టప్రకారం న్యాయం చేయాలని వట్‌పల్లి మండలానికి చెందిన ఒక ఫిర్యాదురాలు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.
-సంగారెడ్డి మండలంలోని తన ప్లాట్‌ను ఒక వ్యక్తి కి అమ్మడానికి నిర్ణయించుకుని అతని వద్ద నుంచి రూ.1 లక్ష అడ్వాన్స్‌గా తీసుకుని మిగిలిన డబ్బును 60 రోజులలో చెల్లిస్తానని అగ్రిమెంట్ చేసుకున్నామని, కానీ ఆ వ్యక్తి మిగిలిన డబ్బులు ఇవ్వకపోగా తన ప్లాట్‌ను వేరే వ్యక్తికి అమ్మేసి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, తనకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని సంగారెడ్డి మండలానికి చెందిన ఒక వ్యక్తి ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.
-తమకు మూడు సంవత్సరాల క్రితం పెండ్లి జరిగిందని, పాప పుట్టిన అనంతరం తన భరర్త వేరొక అ మ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, తన భర్తపై చట్టప్రకారం చర్యలు తీసుకుని న్యా యం చేయాలని పుల్‌కల్ మండలానికి చెందిన ఒక ఫిర్యాదురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ వాటిని పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...