ఖాతాదారుడికి పరిహారం ఇవ్వాలి


Mon,September 16, 2019 11:58 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ : బ్యాంకు అధికారులు ఖాతాదారుడికి సమాచారం ఇవ్వకుండా బ్యాంక్ ఖాతా నుంచి ఆదాయం పన్ను కోత విధించడంతో ఖాతాదారుడికి పరిహారం ఇవ్వాలని వినియోగదారుల ఫోరం గత నెల 27న తీర్పు చెప్పింది. ఖాతాదారుడికి తెలియకుండా తన ఖాతా నుంచి ఆదాయం పన్ను శాఖ కోత విధించారని చందానగర్‌కు చెందిన మాజీ సైనికుడు బోగయ్య వాపోయాడు. ఈ విషయంపై బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్‌లోని అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఒక శాఖ నుంచి తమ శాఖకు ఖాతా మారిన సమయంలో 15-జీ ఫారం సమర్పించలేదని, అందుకే ఆదాయం పన్ను కోత విధించినట్లు ఆయన పేర్కొన్నారు. బ్యాంకులో 15-జీ ఫారం సమర్పించగానే కో త విధించిన మొత్తాన్ని ఖాతాదారుడికి తిరిగి ఇవ్వాల్సి ఉన్న మొత్తాన్ని ఆ దాయ పన్ను శాఖకు పంపినట్లు తప్పుడు సమాచారం తనకు ఇచ్చారని బాధితుడు బోగయ్య ఆవేదన వ్యక్తం చేశా రు. బ్యాంకు అధికారులు సూచించిన విధంగా తాను రిటర్న్స్ దాఖలు చేయగా ఆదాయపు పన్ను శాఖ నుంచి కోత విధించిన మొత్తం తన ఖాతాలో రూ.5,550 జమ అయిందని చె ప్పారు. బ్యాంకు అధికారుల సేవాలోపంపై తనకు జరిగిన అన్యాయం ఇతర ఖాతాదారులకు జరుగొద్దనే ఉద్దేశంతో తాను సంగారెడ్డిలోని వినియోగదారుల ఫోరాన్ని ఫిబ్రవరి 4న ఆశ్రయించి కేసు నమోదు చేశానని తెలిపారు. వినియోగదారుల ఫోరంలో ఇచ్చిన ఫిర్యాదుపై విచారించిన ఫోరం సేవాలోపానికి గాను రూ.5వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.1000 చెల్లించాలని, బీహెచ్‌ఈఎల్ టౌన్ షిప్ ఎస్‌బీఐ ఏజీఎంను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. తీర్పు ఆధారంగా మొత్తం సొమ్మును బ్యాంకు అధికారులు ఇతర ఖాతాలో జమచేశారని తెలిపారు. కానీ బ్యాంకులపై నమ్మకంతో ఖాతాదారులు జమ చేసుకుంటే ఖాతాదారుడికి సమాచారం లేకుండా బ్యాంకు సిబ్బంది చిన్న చిన్న పొరపాట్లు చేసి ఇబ్బందులకు గురిచేయడంతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతిఒక్కరూ తమ ఖాతాల వివరాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని తప్పులు జరగకుండా జా గ్రత్తలు పాటించాలని ఆయన ఖాతాదారులకు విజ్ఞప్తి చేశారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...