ఘనంగా గణపయ్య నిమజ్జనం


Sun,September 15, 2019 10:38 PM

వట్‌పల్లి: వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయకుడికి భక్తులు ఆదివారం రాత్రి నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. వట్‌పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జనంలో యువకులు పాల్గొన్ని నృత్యాలు చేశారు. అనంతరం గణేశుని చెరువుల్లో నిమజ్జనం చేశారు. అంతకు ముందు లంబోధరుడి చేతిలో పూజలందుకున్న లడ్డూ ప్రసాదాన్ని లక్కీ డ్రా తీసి విజేతలకు ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ అశోక్‌గౌడ్ అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, బస్వ రాజ్, బుద్దిరెడ్డి, చంద్రశేఖర్, రవికుమార్, మాణిక్యంగౌడ్, అనిల్, గిరి, దత్తు, మనోహర్, సాయి, అరవింద్, అరుణ్, సాయివరప్రసాద్, వినీత్‌గౌడ్ పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...