రైతులను సాంకేతికంగా ప్రోత్సహించాలి కలెక్టర్ హనుమంతరావు


Wed,September 11, 2019 11:36 PM

సంగారెడ్డి చౌరస్తా : జిల్లాలోని రైతులను సాంకేతికంగా ప్రోత్సహించి వారికి అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్ హనుమంతరావు వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఆత్మ) వారి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయశాఖ అనుబంధ శాఖలైన ఉద్యానవన, పశు సంవర్ధకశాఖ రాబోయే ఐదు సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ప్రణాళికలను రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. వ్యవసాయంలో సాంకేతికంగా అభివృద్ధి చెందే విధంగా రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు. రైతులకు భూసార పరీక్షలు చేసి వాటికి అనుగుణంగా పంటలను వేసేలా చూడాలని, ఎరువులు ఎంత మేరకు వాడాలన్న విషయాలను రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు.

రైతులకు లాభదాయకంగా ఉండే పంటలను వేయుటకు కావాల్సిన ప్రణాళికలు రూపొందించాలని, మార్కెటింగ్ ఆధారంగా డిమాండ్‌కు అనుగుణంగా ఏయే పంటలను వేయాలో తెలుపాలన్నారు. నీటి వనరుల లభ్యతను బట్టి బిందు సేద్యం, తుంపర సేద్యం, నీటి నిల్వల ఆధారంగా పంటలను వేయుటకు రైతులు అధిక దిగుబడి సాధించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నిరంతరం అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ వారికి కావాల్సిన ఏర్పాట్లను చేయాలన్నారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ జేడీ నరసింహారావు, డీపీడీ జయదేవ్, ఉద్యానవనశాఖ జిల్లా అధికారి సునీత, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...