లారీ ఢీకొని ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు


Wed,September 11, 2019 11:35 PM

పటాన్‌చెరు రూరల్ : అతివేగంగా ప్రయాణిస్తున్న లారీ వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన మం డల పరిధిలోని రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని గోపాల్ నగర్‌కు చెందిన బోయిని శ్రీహరి (23), అతడి స్నేహితు డు ఎడ్ల శ్రీరామ్‌లు ద్విచక్ర వాహనంపై, వారి స్నేహితులు మరికొంతమంది వేరే కారులో వినాయక నిమజ్జనానికి వాహనం మాట్లాడేందుకు పటాన్‌చెరుకు వచ్చారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని చౌదరి దా బాకు చేరుకోగానే, గుర్తు తెలియని లారీ అతివేగంగా వచ్చి వెనుక నుంచి వీరి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బోయిని శ్రీహరి, ఎడ్ల శ్రీరామ్‌కు తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు దవాఖాన తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీహరి దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి సోదరుడు సూర్యప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజు తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...