విద్యార్థులకు కబడ్డీ పోటీలు


Wed,September 11, 2019 11:35 PM

రామచంద్రాపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు భెల్ జడ్పీహెచ్‌ఎస్‌లో బుధవారం కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఆర్సీపురం మండల పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు అండర్-14, అండర్-17 విభాగాల్లో కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఎంఈవో పీపీరాథోడ్ ప్రారంభించారు. అండర్-17 విభాగంలో 13 మంది విద్యార్థులు, అండర్-14 వి భాగంలో 14 మంది విద్యార్థులు మండల స్థాయి పో టీల్లో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంఈవో రాథోడ్ మాట్లాడుతూ మండల స్థాయి క్రీడల నుంచి వి ద్యార్థులు మంచి క్రీడాకారులుగా ఎ దుగుతారన్నారు. మండల స్థాయి లో ఎంపికైన విద్యార్థులు జిల్లా స్థా యి కబడ్డీ పోటీల్లో ఆడుతారని తెలిపారు. ఇందులో ఉపాధ్యాయులు బక్కప్ప, నాగరాజు, సింహాచలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బొంతపల్లిలో..
గుమ్మడిదల : క్రీడలతోనే క్రీడాకారులకు మంచి గుర్తింపు వస్తుందని సర్పంచ్ పేర్కొన్నారు. బుధవారం బొంతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి అండర్-14,17 క్రీడాకారులకు ఆటల పోటీలను నిర్వహించారు. దీనికి సర్పంచ్ ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి హాజరై హెచ్‌ఎం అనసూయతో కలిసి క్రీడలను ప్రారంభించారు. పీఈటీలు శ్రీనివాస్‌గౌడ్, సురేఖ, సువర్ణలు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడలను ఆడించారు. దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గురువారం బాలికల జట్లకు పోటీలు ఉంటాయని వారు పేర్కొన్నారు. ఇందులో ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రావు, పీ.శ్రీనివాస్, ప్రభాకర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...