డెంగీతో అప్రమత్తంగా ఉండాలి


Wed,September 11, 2019 11:34 PM

రామచంద్రాపురం : డెంగీతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా ఉపకమిషనర్ బాలయ్య అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్‌లోని బల్దియా ఆధ్వర్యంలో ఇంటింటికీ డెంగీపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. నిలువ ఉన్న నీటిలో దోమ మందును వేశారు. కానుకుంటలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆర్సీపురం జడ్పీహెచ్‌ఎస్‌లో దోమ లార్వాల పెరుగుదల, డెంగీ వ్యాధి గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఆయా ప్రాంతాల్లో బల్దియా అధికారులు, సిబ్బంది నిర్వహించిన కార్యక్రమాలకు ఉప కమిషనర్ ముఖ్యఅతిథిగా పాల్గొని డెంగీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇంటింటికీ దోమ మందులను పిచికారి చేయిస్తున్నామని అన్నారు.

ఇండ్లలో తేమ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలని అదేవిధంగా పాత డబ్బాలను, టైర్లను, వ్యర్థాలు ఉండకుండా చూసుకోవాలన్నారు. నీటిని ఎక్కువ రోజులు నిలువ ఉంచరాదని, తప్పనిసరిగా నీటి డబ్బాలు, డ్రమ్ములపై మూతలను పెట్టాలని తెలిపారు. ఇండ్లలో దోమ తెరలను వాడుకోవడం మంచిదన్నారు. డెంగీకి గురికాకుండా హోమియోపతి మందులను అందజేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు హోమియోపతి మందులను వేసుకోవాలని చెప్పారు. బల్దియా సిబ్బంది కూడా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు డెంగీపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో బల్దియా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్‌సింగ్, ఎంటమాలజీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...