గ్రామాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం


Tue,September 10, 2019 11:44 PM

రాయికోడ్‌: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తుందని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని హస్నాబాద్‌ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసి, ప్రజలకు మౌలిక సదుపాయలు కలిపించేందుకు సీఎం కేసీఆర్‌ 30 రోజులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ఇండ్లు ఎదుట ఇంకుడు గుంతల తవ్వకాలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సుజాత, ఎస్సీ కార్పొరేషన్‌ ఇడీ మండల ప్రత్యేక అధికారి బాబూరావు, తాసిల్దార్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీవో స్టీవేన్‌నీల్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు సాయికుమార్‌, ఎంపీపీ వెంకట్‌రావుపాటిల్‌, జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్‌, మండల ఉపాధ్యాక్షురాలు మమత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సీహెచ్‌.విఠల్‌, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ బస్వరాజ్‌పాటిల్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ నిరంజన్‌, నాయకులు నాజీంపాటిల్‌, తుకారంకురుమ, మల్లేశంకురుమ, రావి, శంకర్‌, అశోక్‌, లింగమయ్య, విఠల్‌, పర్వరెడ్డి, మణిక్యం, విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు హనుమంతు, తుల్జమ్మ, మహిపాల్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, విఠల్‌రెడ్డి,ప్రత్యేక అధికారులు జానకీరాం, నర్సింహులు, సురేశ్‌, జానకీరాం, భార్గవి, తదితరులున్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...