గ్రామాభివృద్ధికే 30 రోజుల కార్యాచరణ


Tue,September 10, 2019 11:43 PM

అందోల్‌ రూరల్‌: 30 రోజుల ప్రణాళికలను అమలు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడానికి గ్రామస్తులందరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ బాలయ్య, ఎంపీడీవో సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండలంలోని తాడ్మనూర్‌, అక్సాన్‌పల్లి గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణలో భాగంగా 5 రోజు నిర్వహిస్తున్న కార్యక్రమాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ హరితహారంలో గ్రామస్తులంతా భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంగీత అనిల్‌ , ఎంపీటీసీ నందిని నర్సింహులు, ఉప సర్పంచ్‌ మాణెయ్య, వార్డు సభ్యులు ఖ్వాజ, రమేశ్‌ , ప్రభుగౌడ్‌ , యువజన సంఘల నాయకులు శేఖర్‌ , మల్లేశం పాల్గొన్నారు.

మునిపల్లిలో..
మునిపల్లి: అల్లాపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్‌ నాగరాణినారాయణ అన్నారు. 30 ప్రణాళికలో భాగంగా మంగళవారం గ్రామంలోని పిచ్చిమ్కొలను తొలిగించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలన్నారు. గ్రామాభివృద్ధిలో భాగం గా సొంత డబ్బులతో పలు రకాల పరికరాలు, మిషన్లు తెప్పించి గ్రామంలో చెత్తాచెదరాన్ని తొలిగించామన్నారు.

వట్‌పల్లిలో..
వట్‌పల్లి: 30రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా మండల వ్యాప్తంగా గ్రామ సభలు కొనసాగుతున్నాయి. మంగళవారం మండల పరిధిలోని గొర్రెకల్‌, మర్వెల్లి, బిజిలీపూర్‌, కేరూర్‌ తదితర గ్రామాల్లో సభలు నిర్వహించారు. గ్రామాల్లో అవసరమైన వసతులపై ప్రజలతో ప్రత్యేక అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రజలకు సూచించారు. సమస్యలు లేని పంచాయతీలే లక్ష్యంగా ప్రభుత్వం 30రోజుల ప్రణాళికను తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామాల సర్పంచ్‌లు, ప్రత్యేక అధికారులు, వార్డు మెంబర్లు, నాయకులు పాల్గొన్నారు.

హత్నూరలో..
హత్నూర: గ్రామాల్లో చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మండలంలోని చింతల్‌చెరు, కాసాల, గోవిందరాజ్‌పల్లి, చీక్‌మద్దూర్‌, పన్యాల, కొడిపాక తదితర గ్రామాల్లో పిచ్చిమొక్కల తొలిగింపుతోపాటు పురాతన ఇండ్లను తొలిగించారు. కాగా పన్యాలలో సర్పంచ్‌ శ్వేత ఆధ్వర్యంలో మహిళలు, బడంపేట గ్రామంలో ఇంటింటికీ పర్యటించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, త్రపజలు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...