మత్స్యకారుల అభివృద్ధికి సర్కార్‌ కృషి


Tue,September 10, 2019 11:43 PM

రాయికోడ్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిచడంమే లక్ష్యంమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని నాగన్‌పల్లి శివారులోని పెద్ద చెరువులో 37లక్షల రావు, కట్లు, బంగారుతీగ రకాల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయని, వారి అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్త్రంలో లేనివిధంగా ప్రభుత్వం వందశాతం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుందని చెప్పారు. ప్రతి మత్స్యకారుడికి సబ్సిడీపై రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారురు. నియోజకవర్గంలో 49 చెరువుల్లో 1.80 కోట్ల చేపపిల్లలను ఉచితంగా వదిలామన్నారు. మత్స్యకార్మికులు పెంచిన చేపలను దళారులను ఆశ్రయించకుండా మార్కెట్‌ ధరకు అమ్ముకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సుజాత, ఎస్సీ కార్పొరేషన్‌ ఇడీ మండల ప్రత్యేక అధికారి బాబూరావు, తాసిల్దార్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీవో స్టీవేన్‌నీల్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు సాయికుమార్‌, ఎంపీపీ వెంకట్‌రావుపాటిల్‌, జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్‌, మండల ఉపాధ్యాక్షురాలు మమత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సీహెచ్‌.విఠల్‌, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ బస్వరాజ్‌పాటిల్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ నిరంజన్‌, నాయకులు నాజీంపాటిల్‌, తుకారంకురుమ, మల్లేశంకురుమ, రావి, శంకర్‌, అశోక్‌, లింగమయ్య, విఠల్‌, పర్వరెడ్డి, మణిక్యం, విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు హనుమంతు, తుల్జమ్మ, మహిపాల్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, విఠల్‌రెడ్డి,ప్రత్యేక అధికారులు జానకీరాం, నర్సింహులు, సురేశ్‌, జానకీరాం, భార్గవి, తదితరులుపాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...