ఖేడ్‌ అభివృద్ధికి కలిసి రావాలి


Tue,September 10, 2019 11:43 PM

నారాయణఖేడ్‌, నమస్తేతెలంగాణ : నారాయణఖేడ్‌ పట్టణంతోపాటు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే వారు టీఆర్‌ఎస్‌ పార్టీతో కలిసి రావాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్‌ పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దిల్‌దార్‌ బాబుఖాన్‌ ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరం కలిసి అభివృద్ధే ప్రధాన కర్తవ్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. దిల్‌దార్‌ బాబుఖాన్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీలో ఉంటూనే తెలంగాణ కోసం పోరాడిన తెలంగాణవాది అని కొనియాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రధానంగా నారాయణఖేడ్‌ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంపై ఆకర్షితుడై టీఆర్‌ఎస్‌లో చేరడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దిల్‌దార్‌ బాబుఖాన్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేయడంతోపాటు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఇచ్చిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ మూడ రాంచందర్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ ఎం.ఏ.బాసిత్‌, మాజీ సర్పంచ్‌ ఎం.ఏ.నజీబ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మహేశ్‌రామ్‌, నాయకులు కె.మల్లేశం, అభిశేక్‌శెట్కార్‌, ప్రభాకర్‌, నగేశ్‌, సాయిరాం, మాజిద్‌, యూసుఫ్‌, హమీద్‌, అంబాదాస్‌, గౌస్‌చిస్తి, విఠల్‌, దుర్గయ్య, గోపాల్‌, ఇమ్రాన్‌, జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...