రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు


Tue,September 10, 2019 04:27 AM

సంగారెడ్డి అర్బన్, నమస్తేతెలంగాణ : మైనార్టీ గురుకుల విద్యార్థులు రాష్ట్రస్థాయి అండర్-17 ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారని గురుకుల పాఠశాల అకాడమిక్ కో ఆర్డినేటర్ నసీరొద్దీన్, ప్రిన్సిపాల్ సల్మాఖాతూన్ తెలిపారు. సోమవారం కంది మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనా విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాస్థాయి క్రీడల్లో ఉత్తమ నైపుణ్యం కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికకావడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 6న మెదక్‌లోని వెస్లీ కళాశాలలో నిర్వహించిన ఫుట్‌బాల్ క్రీడల్లో మెరుగైనా ఆటతీరును ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎదగడం పాఠశాలకు మంచిపేరు తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ఉత్తమ ఆటను ప్రదర్శించిన విద్యార్థులు అబ్బాస్ మన్సూర్, సయ్యద్ ఫయాజ్, మహ్మద్ ముజాహిద్, మనోజ్‌కుమార్, నితిన్ కుమార్ ఉన్నారు. డిప్యూటీ వార్డెన్ మహ్మద్ బషీర్, పీఈటీ శాంతకుమార్, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.
.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...