యంత్రాలూ.. నిర్ణయించ గలుగుతాయి


Tue,September 10, 2019 04:27 AM

సంగారెడ్డి చౌరస్తా : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో అత్యంత ప్రధానమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటి వరకు కంప్యూటర్ ఆధారంగా మనిషి అభివృద్ధి చేసిన ఎన్నో సాంకేతిక యంత్రాలను చూశాం. రోబో వంటి అత్యంత సాంకేతిక యంత్రం కూడా మనిషి సూచనలకు లోబడే పనిచేస్తుంది. అంతేకాని తనకు తానుగా సొంతగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అయితే తనకు తానుగా సొంత నిర్ణయాలు తీసుకోగలిగే యంత్రాలను అభివృద్ధి చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). ఒకరకంగా చెప్పాలంటే అచ్చు మనిషి మాదిరిగా సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వంటి సహజ లక్షణాలు కలిగిన యంత్రాలను అభివృద్ధి చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి ఆవిష్కరణల కోసమే ప్రపంచం ఎదురుచూస్తున్నది. ఆ దిశగా అనేక పరిశోధనలు కూడా ప్రపంచ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అంతర్గత చిక్కులను చేధించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతర్గత యాక్సెసింగ్‌ను అభివృద్ధి చేశారు. ఈ మేరకు వారు జరిపిన పరిశోధన వివరాలు ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం సమాజంలో విస్తృతంగా వాడుకలో ఉన్న ఫోన్లు, టాబ్లెట్లు, టెలివిజన్ సెట్లలో ఉపయోగించే డీప్ లర్నింగ్ మోడల్స్‌లో పారదర్శకత లేకపోవడాన్ని పరిష్కరించడం, వాటిని ఉపయోగించే వినియోగదారులు వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోకుండా నిరోధించడానికి ఆచరణాత్మక ఆభివృద్ధిని సాధించాలనే లక్ష్యంగా నిర్వహించిన పరిశోధనల్లో వారు సఫలీకృతమయ్యామని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రధాన భూమిక పోషించే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్స్(ఏఎన్‌ఎన్) అనేది ఏ1 నమూనాలు, ప్రోగ్రాములుగా పేర్కొనవచ్చు. అయితే ఇవి మానవ మెదడు చేసే పనిని అనుకరిస్తాయి. దీన్ని ఆధారంగా చేసుకొని యంత్రాలు మరింత మానవ తరహాలో నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవచ్చని ఐఐటీ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఆధునిక ఏఎన్‌ఎన్‌లు తరచుగా డీప్ లెర్నింగ్ (డీఎల్) అని కూడా పిలుస్తారని, ఈ క్రమంలో యంత్రాలకు ఇన్‌పుట్‌గా అందించే డేటాను ప్రాసెస్ చేయడమే కాకుండా దానికదే నేర్చుకునేందుకు శిక్షణ ఇవ్వగల సంక్లిష్టతలో పెను మార్పులు వచ్చాయని వివరించారు.

అదే విధంగా అనేక పనుల్లో మానవ పనితీరుతో దాదాపుగా సరిపోతాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎటువంటి నిర్ణయానికి అవి వస్తోయో తెలియనందున నిర్ణయాలకు కారణం అవసరమైనపుడు వాటిని తక్కువ ఉపయోగకరంగా చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనలో ఐఐటీ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వినీత్ ఎన్.బాలసుబ్రహ్మణ్యన్, అతడి విద్యార్థులు ఆధిత్య చటోపాధ్యాయ, పియూషిమనుప్రియా, అనిర్బన్ సర్కార్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్‌కు సంబంధించి ప్రపంచ స్థాయిలో జరుగుతున్న అత్యంత ఖరీదైన సమావేశాల్లో భాగంగా వారి పరిశోధన ఇటీవల జరిగిన 36వ అంతర్జాతీయ సమావేశంలో అధికారిక ఉత్తర్వులను పొందింది.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...