గర్భకోశ క్యాన్సర్ డిటెక్ట్ ఉచిత పరీక్షలను మహిళలు వినియోగించుకోవాలి


Tue,September 10, 2019 04:26 AM

సంగారెడ్డి మున్సిపాలిటీ : మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు, ఆ ఇంట్లో అందరూ క్షేమంగా ఉంటారని, అలాగే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మంజుశ్రీ అన్నారు. చిన్నజీయర్ స్వామి మహిళల ఆరోగ్యం కోసం మహిళా వికాస్ తరంగిణి అనే మిషన్‌ను ప్రారంభించారు. సోమవారం పట్టణ శివారులోని శ్రీమహాలక్ష్మి గోదా సమేత విరట్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతీ ప్రజ్వళన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మహిళలు గర్భకోశ వ్యాధులు(క్యాన్సర్) వల్ల బాధ పుడుతున్నారన్నారు. క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలో గుర్తించి మందులు వాడితే మరణాలు అరికట్టొచ్చని అన్నారు. చిన్న జీయర్‌స్వామి మహిళా వికాస్ తరంగిణి మిషన్ ప్రారంభించి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయించి మహిళలకు ఎంతో మేలు చేస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం దేవానాథ జీయర్‌స్వామి మాట్లాడుతూ ఈ మిషన్‌లో గర్భకోశానికి సంబంధించిన క్యాన్సర్ డిటెక్ట్ పరీక్షలు సుకృతం సేవా సంస్థల నిర్వాహకులు కందాడై వరదాచార్యులు, డాక్టర్ కుమార్‌రాజా సహకారంతో, జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా చేస్తున్నట్టు తెలిపారు.

అవసరమైన మహిళలలకు ఉచితంగా మందులు ఇస్తున్నట్లు తెలిపారు. అర్చకులు వరదార్యులు మాట్లాడుతూ చిన్నారులకు సేవలందించే అంగన్‌వాడీ టీచర్లకు మొదటి ప్రాధాణ్యతగా ఆలయ ప్రాంగణలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ శిబిరానికి 600మంది అంగన్‌వాడీ టీచర్లు రాగా ఇందులో 80మందికి గర్భకోశ పరీక్షలు నిర్వహించారని, 52మందికి మొదటి, రెండో దశలో గర్భకోశ క్యాన్సర్ ఉందని నిర్ధారణ కాగా 10మందికి మూడోస్థాయిలో క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 10న మహిళలందరికీ గర్భకోశ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదావకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మహిళా వికాస్ తరంగిణి డాక్టర్లు, సభ్యులు, జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్టు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...