కష్టపడే వారికే గుర్తింపు


Sun,September 8, 2019 10:56 PM

-టీఆర్‌ఎస్‌ బలోపేతానికి అహర్నిశలు శ్రమిద్దాం
-90శాతం గ్రామ, మండల, పట్టణ, డివిజన్‌ కమిటీల ఎంపిక పూర్తి
-మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
పటాన్‌చెరు రూరల్‌ : పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపుతోపాటు పదవులు వస్తాయని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన పటాన్‌చెరు పట్టణ శివారులోని జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే సభ్యత్వ నమోదులో నియోజకవర్గం మొదటిస్థానంలో ఉందని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. నియోజకవర్గంలో దాదాపుగా 90శాతం గ్రామ, మండల, పట్టణ, డివిజన్‌ కమిటీల ఎంపిక పూర్తయిందని, మిగతా పది శాతం త్వరలోనే పూర్తవుతుందని ప్రకటించారు. ఆయా మండలాల్లో సమావేశాలు నిర్వహించి కమిటీలను ప్రకటించాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. ప్రతి ఆరు నెలలకొకసారి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామని, కార్యకర్తల సమస్యలను గుర్తించి పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా..
-ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన కార్యకర్తలకు పదవులు ఇప్పిస్తానని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. ఏ ఒక్క కార్యకర్తను విస్మరించలేదని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమర్థవంతమైన నాయకత్వం, పటిష్టమైన క్యాడర్‌ ఉన్న పార్టీ టీఆర్‌ఎస్‌ అని చెప్పారు. తనను రెండోసారి ఎమ్మెల్యేగా, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే దక్కిందన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో 55,200 సభ్యత్వాలను నమోదు చేసి, జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇది కార్యకర్తల కృషితోనే సాధ్యపడిందని, త్వరలో జరుగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ ఐదేండ్లలో మరింత అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామని చెప్పారు. పదవులు చాలా ఉన్నాయని, పదవులు రానివారు ఏమాత్రం నిరాశ చెందొద్దని, అర్హులైన కార్యకర్తలందరికీ పదవులు ఇప్పించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి భరోసానిచ్చారు.

కలిసికట్టుగా పనిచేద్దాం.. గులాబీ జెండా ఎగరేద్దాం
-ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి
పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని, మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేద్దామని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయని, అందులో 60 కౌన్సిలర్లు ఉంటారని గుర్తుచేశారు. వీటితో పాటు ఆత్మ, దేవాలయ, మార్కెట్‌ కమిటీలు, నామినేటెడ్‌, కార్పొరేషన్‌ వంటి పదవులు ఉన్నాయని, కష్టపడే కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచే కృషిచేయాలని కోరారు. అనంతరం పార్టీ సభ్యత్వాలకు సంబంధించిన రూ.40,48,000 చెక్కును పార్టీకి అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కుంచాల ప్రభాకర్‌, జడ్పీటీసీలు సుప్రజవెంకట్‌రెడ్డి, గంగుల సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్‌, ఎంపీపీలు సుష్మశ్రీ, ఈర్ల దేవానంద్‌, కార్పొరేటర్‌ తొంట అంజయ్యయాదవ్‌, వి.ఆదర్శ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొలన్‌ బాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు నాలకంటి యాదగిరి యాదవ్‌, శ్రీశైలం యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండలశాఖ అధ్యక్షులు దశరథ్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, మల్లారెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ గడీల కుమార్‌గౌడ్‌, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు బి.చంద్రశేఖర్‌రెడ్డి, తులసీరెడ్డి, పట్టణ అధ్యక్షులు బి.విజయ్‌కుమార్‌, పరమేశ్‌యాదవ్‌, దేవేందర్‌ చారి, నాయకులు జి.మాణిక్య ప్రభు, బొర్రా వెంకట్‌రెడ్డి, సద్ది విజయభాస్కర్‌రెడ్డి, బూరుగడ్డ నగేశ్‌, గోవర్ధన్‌రెడ్డి, బాసిరెడ్డి నర్సింహారెడ్డి, బసవేశ్వర్‌, గిద్దె నర్సింహ, నర్రా భిక్షపతి, మక్బూల్‌, ఎండీ మేరాజ్‌ ఖాన్‌, ఎంపీటీసీ, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...