పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి


Sun,September 8, 2019 10:52 PM

మునిపల్లి: గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మునిపల్లి ఎంపీడీవో జయరామ్‌ విజయ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని ఆయా గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ సభలు నిర్వహించారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
గ్రామాల్లో పారిశుధ్య చర్యలు
హత్నూర: మండలంలో పారిశుధ్య చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా ఆదివారం మండలంలోని చీక్‌మద్దూర్‌, ముచ్చర్ల, చింతల్‌చెరు, కాసాల, సికింద్లాపూర్‌ గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టడంతోపాటు ఇంటింటి సర్వే నిర్వహించారు. పలు గ్రామాల్లో ఎంపీడీవో ప్రమీలానాయక్‌ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వీధిదీపాల ఏర్పాటు, మురుగుకాల్వవలు, సీసీరోడ్లు నిర్మాణం, హరితహారం మొక్కలు నాటడం, మరుగుదొడ ్లనిర్మాణం తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...