కులబ్‌గూర్‌ను జిల్లాలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి


Sun,September 8, 2019 10:52 PM

-జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ
కంది / సంగారెడి రూరల్‌: కులబ్‌గూర్‌ గ్రామాన్ని జిల్లాలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ అన్నారు. ఆదివారం సంగారెడ్డి మండలం కులబ్‌గూర్‌ గ్రామంలో నిర్వహించిన పల్లెబాట మూడో రోజు కార్యక్రమంలో భాగంగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పల్లెబాట కార్యక్రమలో భాగంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ ముందుగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో హరితహారంలో భాగంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలను నాటారు. అలాగే గ్రామంలో నెలకొన్న సమస్యలను నేరుగా పర్యటించి తెలుసుకున్నారు. అవసరమైన చోట మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉందని, అలాగే కొన్ని అంతర్గత సీసీ రోడ్లు వేయాల్సి ఉండడాన్ని ఆమె గుర్తించి వెంటనే పనులు పూర్తి చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. అలాగే, కులబ్‌గూర్‌లో కొత్తగా డంపింగ్‌యార్డు ఆమె శంకుస్థాపన చేయగా, స్థానిక సత్య సాయి వాటర్‌ వర్క్స్‌ సైప్లె కేంద్రాన్ని ఉద్యాన వనంగా మార్చాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించినప్పడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో గ్రామాలను అభివృద్ధి పర్చాలనే ఉద్దేశంతో 30 రోజుల పాటు పల్లెబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామాన్ని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం డీపీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శంగా మార్చినట్లయితే వ్యక్తిగతంగా వారికి పలు బహుమతులను అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య, సర్పంచ్‌ సాజిదాబేగం, పంచాయతీ కార్యదర్శి క్రిస్టఫర్‌, తదితరులు పాల్గొన్నారు.
కంది మండలంలో..
కంది మండలంలోని మామిడిపల్లి, కౌలంపేట గ్రామాల్లో ఎంపీడీవో రంగాచార్యులు పర్యటించారు. కౌలంపేటలో సర్పంచ్‌ షఫీతో కలిసి గ్రామంలోని వైకుంఠధామాన్ని పరిశీలించారు. అలాగే, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిశీలించి అందుకు అవసరమైన చర్యలకు క్రింది స్థాయి సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే, మామిడిపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన హరితహారంలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులకు మొక్కలను అందజేసి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్‌ ఆఫీసర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...