గణేశ్‌ ఉత్సవాలపైనా నిరంతర నిఘా


Sun,September 8, 2019 10:52 PM

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ : గణేశ్‌ నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యా యి. ప్రతి రోజు వినాయకులకు ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేస్తున్నారు. గ్రామాల్లో, మండపాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జహీరాబాద్‌ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పండుగకు ముందే పోలీసులు ఉత్సవ కమిటీ బృందాల వివరాలను గ్రామాల వారీగా సేకరించారు. మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి పూర్తి వివరాలను సేకరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. జహీరాబాద్‌ పట్టణంలో సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించారు. జహీరాబాద్‌లో నెల రోజుల ముందుగానే పోలీస్‌ ఉన్నతాధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గణేశ్‌డి మండపాలను ప్రతిష్ఠించేందుకు పేర్లను నమోదు చేసుకున్నారు. మండపాల వద్ద ఏర్పాటు ముందుగానే ఆయా గ్రామాల ఉత్సవ కమిటీలకు అవగాహన కలిగించారు.

మండపాలకు జియో ట్యాగింగ్‌..
వినాయక మండపాలను జియో ట్యాగింగ్‌ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న మండపాలతో పాటు ఇతర గణేశ్‌ పందిర్ల వద్ద పోలీసు యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేశారు. జియో ట్యాగింగ్‌ను మండపాలను పోలీస్‌ క్యాంపు కార్యాలయంలోని కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేశారు. దీని ద్వారా మండలపాల సమీపంలో ఏ చిన్న సంఘటన జరిగిన పోలీసులకు నిమిషాల వ్యవధిలో తెలిసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకుని, పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పట్టణంలో ఉన్న ముఖ్యమైన గణేశ్‌ మండపాలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే ప్రాంతాలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. మూడు, నాలుగు మండపాల వద్ద ఒక కానిస్టేబుల్‌, ఇద్దరు హోంగార్డుల చొప్పున ఉండేలా ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సాయుధ బలగాలను కూడా మోహరించారు. జహీరాబాద్‌ పట్టణంలో సీఐ. ఎస్‌ఐలు తమ పరిధిలో పెట్రోలింగ్‌ చేపడుతున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...