అభివృద్ధే లక్ష్యంగా గ్రామాల్లో అధికారులు


Sun,September 8, 2019 10:50 PM

కోహీర్‌ : గ్రామాలాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికల తయారీలో భాగంగా సంబంధిత అధికారులు ఆదివారం తమకు కేటాయించిన గ్రామాలను సందర్శించారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని వార్డులను సందర్శించి చెత్త, పిచ్చిమొక్కలను తొలిగించారు. స్థానికులతో కలిసి వారు శ్రమదానం నిర్వహించారు. డంపుయార్డుల నిర్మాణాలకు స్థలాలను పరిశీలించారు. రాజనెల్లిలో డంప్‌ యార్డు నిర్మాణానికి ఎంపీపీ మాధవి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మండల పంచాయతీరాజ్‌ అధికారి వెంకట్‌రెడ్డి, కార్యదర్శులు, ఉపాధిహామీ టీఏలు, ఎఫ్‌ఏలు, సర్పంచులు ఉన్నారు.
గ్రామాల్లో తిరుగుతూ..సమస్యలను గుర్తిస్తూ..
న్యాల్‌కల్‌ : ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం మండలంలోని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించారు. ఆయా వార్డులో అంతర్గత రోడ్లు, మురుగు కాల్వలు, పైప్‌లైన్‌ లీకేజీలు, చెత్తచెదారం, ముండ్లపోదాలు, శిథిలావస్థకు చేరిన భవనాలు, డంప్‌యార్డులు, శ్మశాన వాటికలను పరిశీలించారు. వార్డులలో నెలకొన్న సమస్యలను ప్రజలు అధికారులకు చెప్పడంతో నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సుజాత, ఎంపీడీవో సయ్యద్‌ ముజాఫర్‌షాఖాన్‌, ఈవోపీఆర్డీ యాదయ్య, సూపరింటెండెండ్‌ రాజశేఖర్‌, ఎంపీపీ అంజమ్మ, జడ్పీటీసీ స్వప్నకుమారి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగంలో..
ఝరాసంగం : మండల కేంద్రంతో పాటు, మేదపల్లి, నార్సపూర్‌, కప్పాడ్‌, చిల్కేపల్లి తదిర గ్రామాల్లో ఆదివారం ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, సర్పంచ్‌లు పంచాయతీ కార్యదర్శులు, 30 రోజుల ప్రణాళిక కమిటీ సభ్యులు,ఐకేపీ మహిళా సంఘాల సభ్యులు కలిసి పర్యటించారు. రోడ్లుపై చెత్త, మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ ఊరు బాగుపడాలంటే ప్రతి ఒక్కరికి సేవా భావం అలవర్చుకోవాలన్నారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు సహరించాలని కోరారు. అంతకుముందు 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బొగ్గుల జగదీశ్వర్‌, ఇందిరమ్మ, శశిరేఖ, పరమేశ్వర్‌, ఎంపీటీసీ రజినిప్రియ, ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, మండల సమాఖ్య అధ్యక్షురాలు మమత తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...