గ్రామాభివృద్ధికి 30 రోజుల ప్రణాళిక


Sat,September 7, 2019 11:44 PM

రాయికోడ్: పల్లెలను ప్రగతి వైపు బాటలు వేసేందుకు సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రణాళికలు రూపొందించారని మండల ప్రత్యేక అధికారి బాబూరావు, జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్ అన్నారు. శనివారం మండల పరిధిలోని సింగితం, పీపడ్‌పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన 30 రోజుల ప్రణాళిక భాగంగా గ్రామ కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడంతో పాటు నాలుగు స్థాయి సంఘాల కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు, జడ్పీటీసీ మాట్లాడుతూ పంచాయతీకి సంబంధించిన బడ్జెట్‌పై చర్చించి ఐదు సంవత్సరాల్లో గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ప్రజలకు వివరించి వారి సూచనలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కోసం ప్రజలను పూర్తిగా భాగస్వామ్యం చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో స్టీవేన్‌నిల్, ఏఈ శారద, మండల ఉపాధిహామీ అధికారి సురేశ్, ఎంపీటీసీలు నిరంజన్, కృష్ణ, సర్పంచ్ సంతోశ్‌పాటిల్, వీఆర్వోలు మల్లన్న, గఫార్, పంచాయతీ కార్యదర్శిలు అనిత, రాజేందర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

వట్‌పల్లిలో..
వట్‌పల్లి: గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించి తగిన ప్రణాళికలు రూపొందించడంకోసమే గ్రామ అభివృద్ధి కమిటీలు వేస్తున్నామని ఎంపీడీవో రఘు అన్నారు. 30రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా శనివారం మండల కేంద్రం వట్‌పల్లితో పాటు పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. నిర్జేప్లలో నిర్వహించిన గ్రామ సభలో ఎంపీడీవో రఘు పాల్గొన్ని గ్రామంలో అవసరమైన వసతులపై ప్రజలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు లేని పంచాయతీలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ 30రోజుల ప్రణాళికను రూపొందించారని చెప్పారు. కార్యక్రమంలో ఆయా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

హత్నూరలో..
హత్నూర: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శనివారం సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. ప్రభుత్వం 30 రోజుల గ్రామ పంచాయతీల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా అన్ని పంచాయతీల్లో కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. కాగా పలు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ వావిలాల నర్సింహులు, ఎంపీడీవో ప్రమీలానాయక్‌తోపాటు ప్రత్యేక అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు, గ్రామ కార్యదర్శులు ప్రజలు పాల్గొన్నారు.

పుల్కల్‌లో..
పుల్కల్: మండలంలో 30 రోజులు కార్యాచరణలో భాగంగా గ్రామాలలో రెండవ రోజు శ్రామదానం కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌ల ఆధ్వర్యంలో జరిగిన శ్రమదానంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ముదిమాణిక్యంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి, సర్పంచ్ అరుణ శ్రమదానంలో పాల్గొని పిచ్చి మొక్కలను తొలిగించారు. గొంగ్లూర్‌లో డీసీసీబీ డైరెక్టర్ ఆర్ రాంచంద్రారెడ్డి, సర్పంచ్ లక్ష్మి శ్రమదానంలో పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...